చర్మ రంధ్రాలు మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి, వీటిని సూక్ష్మంగా తనిఖీ చేస్తే గమనించవచ్చు. కొద్దిమందిలో అవి పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం(ఆయిలీ స్కిన్) ఉండే వాళ్లకు ఈ రంధ్రాలు పెద్దగా అయ్యే అవకాశాలు ఎక్కువ, వాటివలన మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలు రావచ్చు.
ముఖ్య గమనిక, ఈ రంధ్రాలను తొలగించటానికి శాశ్వత చికిత్సలు లేవు. కానీ కొన్ని ఇంటి నివారణ పద్ధతుల ద్వారా వాటియొక్క పరిమాణంను తగ్గించవచ్చు.
దోసకాయ :-
రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ గులాబీ నీలల్లో కలిపి ఒక పత్తితో ముఖంపై రాయండి.
గుడ్లు :-
ఒక కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని, కొద్ది సేపు బాగా చిలికి ఫ్రిజ్లో 5 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖంపై రాయండి. కొన్ని నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ముఖంపై ఉంచి కడగండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన రంధ్రాల యొక్క పరిమాణంలో మార్పులను చూడవచ్చు. జిడ్డు చర్మం ఉండే వారు ఈ మిశ్రమం వాడటం వలన రంధ్రాలు చిన్నగా అవ్వటం మాత్రమే కాదు చర్మం కూడా ధృఢంగా మరియు బిగువుగా అవుతుంది.
ముల్లంగి :-
ఒక టేబుల్ స్పూన్ వినిగర్, నిమ్మరసం, తేనె మరియు రెండు టేబుల్ స్పూన్ల తాజా ముల్లంగి రసాన్ని ఒక గిన్నెలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక జార్లో స్టోర్ చేయండి. పత్తిని ఉపయోగించి ఈ నీటిని రోజూ చర్మంపై రాయండి. ఎలాంటి రకమైన చర్మం ఉన్న వారైనా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు.
ముల్తాని మట్టి :-
రెండు టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టిని రెండు టేబుల్ స్పూన్ల గులాబి నీటిలో(రోజ్ వాటర్) కలిపి చర్మంపై రాయండి. జిడ్డు చర్మం ఉండే వారికి ఇది మంచి పరిష్కారం. ఈ మిశ్రమాన్ని తరచూ వాడవద్దు, ఎందుకంటే చర్మం పొడిగా అవుతుంది.
బొప్పాయి పండు :-
పండిన బొప్పాయి పండును బాగా మెత్తగా చేసి ముఖంపై సమానంగా రాయండి. రంధ్రాలు ఎక్కువగా ఉన్న చోట్లలో రాసి 30 నిమిషాల తరువాత వెచ్చని నీళ్లతో కడగండి. ఇది రంధ్రాలను తొలగించటమే కాకుండా ముఖంలోని నరాలలో స్థితిస్థాపకతని(ఎలాస్టిసిటీ) పెంచుతుంది. బొప్పాయి పండులోని యాంటీ-యాక్సిడెంట్ లక్షణాలు మీ చర్మాన్ని బాగు చేసి మెరుగుపరుస్తుంది.
తేనె :-
తేనె కూడా మీ చర్మానికి చాలా మంచిది. ఇది ఒక మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఇందులో చాలా వైద్య లక్షణాలు ఉన్నందున చర్మాన్ని శుభ్రం చేస్తుంది. తేనెని మీ ముఖంపై రాసి చూడండి, మీ చర్మ రంధ్రాలు చిన్నగా మరియు చర్మం మెరుస్తూ అందంగా అవుతుంది.
పెరుగు :-
ఇందులో లాక్టిక్ ఆమ్లాలు(ఆసిడ్స్) ఉంటాయి, ఇవి మీ చర్మంలోని జిడ్డును మరియు సన్నటి గీతలను(ఫైన్ లైన్స్) తొలగించి రంధ్రాలను తగ్గిస్తుంది. పెరుగును ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీళ్లతో కడగండి. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నట్లయితే పెరుగులో కోడిగుడ్డు యొక్క తెల్లసొనను కలుపుకొని ముఖంపై రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
----------×----------