★ టీస్పూన్ బాదం పప్పుపొడి, అర టీస్పూన్ గంధం పొడి, అర టీస్పూన్ బంగాళాదుంప తరుగు, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ళ కింద వలయాలున్న చోటే రాయాలి. పది నిముషాలు విశ్రాంతి తీసుకొని శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి.
★ రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడిలో టేబుల్ స్పూన్ ఓట్స్, కొన్ని పాలు, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరచుకోవాలి. మచ్చలు తగ్గి, చర్మం కాంతివంతముగా అవుతుంది.
★ రెండు టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా. ల ఓట్స్, 25 గ్రా. ల పెరుగులో కప్పుడు నీళ్ళు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. బ్లాక్ హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా కాంతివంతముగా కనిపిస్తుంది.
★ రెండు టీస్పూన్ల క్యారెట్ తురుము, టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసేన్షియల్ ఆయిల్ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. లా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
★ పాలకూర, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, జీడిపప్పు, బాదం, అవిసె వంటి గింజ ధాన్యాలు , పాలు, పెరుగు, తక్కువ కొవ్వు కలిగిన ఇతర పాల ఉత్పత్తులు తరచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కురులు ఏపుగా పెరిగి, ఆరోగ్యంగా నిగనిగలాడతాయి.
★ టీస్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్, అరటీస్పూన్ కార్న్ పౌడర్ కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా, కాంతివంతముగా చేస్తుంది.
★కొబ్బరి నూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మర్దన చేయాలి. రోజులో కొన్ని సార్లు చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ళ సమస్యలు తగ్గి మృదువుగా అవుతాయి.
★ కొద్దిగా వెన్న తీసుకొని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు లేక నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి.
★ చెరుకు రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాయాలి. వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ విధముగా రొజూ చేస్తే చర్మం ముడతలు తగ్గుతుంది.
★ అరకప్పు బియ్యప్పిండితో బొప్పాయి పండు గుజ్జు, ఒక చెక్క నిమ్మరసం పిండి, పేస్ట్ లా చేయాలి. దీనిని ముఖానికి మెడకు పట్టించి పదినిమిషాల తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే ముఖం, మెడ శుభ్రంగా, తాజాగా కనిపిస్తాయి.
★ కార్న్ ఫ్లెక్స్ ను పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి రబ్ చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
★ ముల్తానీ మట్టి, తేనె, బొప్పాయి పండు గుజ్జు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతముగా కనిపిస్తుంది.
★ అరటిపండు గుజ్జు, మూడు టేబుల్ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ వెనిల్లా ఎక్ష్ ట్రాక్ట్ కలిపి మేనికి రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత వేడినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది.
★ విటమిన్ 'ఇ' ఆయిల్ లో మూడు చుక్కల నిమ్మరసం, అరటీస్పూన్ గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది.
★ తేనె, చక్కెర సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి కళ్ళ చుట్టూ మినహాయించి, ముఖానికి, మెడకు పట్టించి, వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తీసుకురావడంతో పాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్ మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
★ గింజలేని ద్రాక్ష పండ్లను సగానికి కట్ చేయాలి. ఈ ముక్కలను ముఖంపైన, మెడపైన లైన్ గా అమర్చాలి. ఇరవై నిముషాలు అలాగే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి.
★ బెల్లం, పెరుగు కలిపి పేస్ట్ లా చేయాలి. దీనికి ముల్తానీ మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పూసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది.
★ అల్లం ముక్కలు 5, ఆముదం గింజలు 5, జీడి ఆకుల రసం 10 గ్రా., ఆవనూనె 20 గ్రా. కలిపి నూరుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే శరీరం అందంగా తయారవుతుంది.
★ శరీరంపై అధికంగా చెమటపడుతుంటే కరక్కాయ పెచ్చులను నీటితో నూరి ఒంటికి నలుగుపెట్టుకోండి. చెమట తగ్గి చర్మం చక్కగా ఉంటుంది. అలాగే సునాముఖి చూర్ణంను అరకప్పు ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ తాగుతుండాలి.
★ ఉడికించిన బంగాళాదుంప గుజ్జును, మరిగించిన పాలలో వేసి మెత్తని పేస్ట్ లా వేసుకుంటే చర్మం కాంతివంతముగా మారుతుంది. పొడిబారే సమస్యే ఉండదు.
★ టీ బ్యాగ్ లను బాగా మరిగించిన నీళ్ళలో వేసి కాసేపయ్యాక పెదాల మీద ఉంచాలి. ఇలా చేస్తే పగుళ్ళు పోతాయి.
★ గోరువెచ్చని నెయ్యిలో దూదిని ఉండగా చేసి వేయాలి. కొద్ది సేపయ్యాక తీసి పెదాలపై ఇరవై నిమిషాలపాటు బాగా రాయాలి. దీనివల్ల తేమ అంది పెదాలు మృదువుగా మారతాయి.
★ చలి కాలంలో పెదాలు పగిలి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా క్యారెట్ రసం తీసుకొని దానికి తేనె కలిపి రాసుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. తేమ అంది ఆరోగ్యంగా పెదాలు కనిపిస్తాయి.
★ మాయిశ్చరైసర్ లో కొద్దిగా చక్కెర వేసి పెదవులకు రాసి మర్దన చేయాలి. మృతచర్మం పోయి పెదవులు అందంగా, గులబీరంగులో కన్పిస్తాయి.
★ పడుకునేటప్పుడు మెడ కింద కచ్చితంగా తలగడలాంటిది పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కళ్ళ కింద భాగానికి చక్కగా రక్త ప్రసరణ అవుతుంది. దీని వల్ల నల్లని వలయాలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. కళ్ళ వాపు సమస్యలు దరిచేరవు.
★ కప్పు ఆవనూనెలో గుప్పెడు గోరింటాకు వేసి బాగా మరిగించాలి. చల్లారాక ఆకును తీసి నూనె నిల్వ చేసుకొని రాత్రిపూట రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేయాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది.
★ రెండు అరటి పండ్లను గుజ్జులా చేసి అందులో రెండు చెంచాల పెరుగు, మూడు చెంచాల తేనె వేసి బాగా కలిపి ముఖానికి పూతల రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది.
★ ఈ చర్మతత్వం ఉన్న వారి ముఖం తయారైనా కొన్ని నిమిషాలకే జిడ్డుకారుతుంది. ఇలాంటి వారు టొమాటో రసానికి కొంచెం కీరదోస రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చర్మంఫై నూనె ఉత్పత్తి తగ్గడంతో పాటూ మొటిమల సమస్య కూడా రాదు.
ఫేషియల్ కి :
★ బ్లాక్ హెడ్స్ వస్తున్న చోట టొమాటో ముక్కతో బాగా రుద్ది ఐదు నిముషాలు వదిలేయాలి. తరవాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రపడుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్యా ఎదురవదు. టొమాటోలో ఉండే విటమిన్ 'ఎ','సి','కె' లు మొటిమలు రాకుండా నిరోధిస్తాయి.
మృదువుగా మారేలా:
★ టొమాటో గుజ్జుకి కొంచెం పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఎండా ప్రభావంవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. కొందరిలో దగ్గర నుంచి చూస్తే చర్మ రంద్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి వారు టొమాటో గుజ్జుకి కొంచెం నిమ్మరసం కలిపి రాసుకుంటే మంచిది.
కమిలిన చర్మానికి :
★ ఎండకి వడలిపోయిన చర్మం ఎర్రగా కమిలిపోతుంది. అలాంటపుడు కప్పు కొబ్బరిపాలు, అరకప్పు రోజ్ వాటర్ కలిపి ఒక బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఎండలోకి వెళ్లి రాగానే ఆ మిశ్రమాన్ని ముఖంఫై చిలకరించుకొని అరగంట పాటు ఉండండి. ఎండకి ఎర్రగా మారిన చర్మం మళ్లీ మామూలు స్థితికి రావడంతో పాటు టాన్ కూడా తగ్గుతుంది.
ఫేస్ ప్యాక్ :
★ కొబ్బరి పాలల్లో ఒక టీస్పూన్ ఎర్రచందనం పొడి, కొన్ని కుంకుంపూవు రేకులు, తేనె కలిపి మెత్తగా చేసి ముఖానికి, మెడకి రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం వెన్నులీనుతుంది. నాలుగైదు బాదం గింజల్ని ముద్దగా చేసి దానికి టేబుల్ స్పూన్ పంచదార, పెసర పిండి, కప్పు కొబ్బరి పాలు కలిపి ఒంటికి పట్టించి రుద్దితే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
మేకప్ రిమూవర్ :
★ రెండు స్పూన్ల కొబ్బరి పాలకి, నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని కలిపి ఒక డబ్బాలో వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. దీనిని వారం రోజుల పాటు మేకప్ రిమూవర్ లా వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే రిమూవర్ లా కన్నా ఈ మిశ్రమం ముఖాన్ని బాగా శుభ్రం చేస్తుంది.
కొబ్బరి క్లెన్సర్ :
★ చర్మాన్ని శుభ్రపరచుకోవడానికి కొబ్బరి పాలతో క్లెన్సర్ ను తయారుచేసుకోవచ్చు. కొబ్బరి పాలకి, మెత్తటి పెరుగుని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఐదు నిమిషాల పాటు వదిలేసి తడి వస్త్రముతో మృదువుగా తుడవండి. తరవాత చల్లని నీటిని ముఖంఫై చల్లుకొని కడిగేసుకోండి. చర్మంఫై పట్టిన మృతకణాలు, మురికి పోతాయి.
----------×----------