ఆడవాళ్ల సౌందర్య చిట్కాలు.....

మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపుగా చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరు ఆశించడంలో తప్పులేదు. ఉన్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలన్న చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం బ్యూటీపార్లర్‌లకు వెళ్లే తీరిక లేకుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్‌మెంట్లు.


★ పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్టును చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.ఇలా చేస్తే నిగనిగాలాడే చర్మం మీ సొంతం.

★ ఒక టమాటోను గ్రైండ్‌ చేసి 3చుక్కల నిమ్మరసం కలిపి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ఇరవై రోజుల పాటు ఉదయం, సాయంత్రం చేయాలి.

★ ఒక కప్పు వెనిగర్‌లో కప్పు నీళ్లుపోసి పలుచబరిచి చర్మానికి పట్టించాలి.

★ పచ్చి బంగాళాదుంపను గ్రైండ్‌ చేసి రసం తీసి దానికి నిమ్మరసం కలిపి చర్మానికి పట్టించాలి.

★ నాలుగు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్‌ల కొబ్బరిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి.

★ ఒక టేబుల్‌ స్పూన్‌ పెసరపిండికి రెండు టీ స్పూన్ల పాలు, రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా నాలుగు వారాలపాటు చేయాలి.

★ నాలుగు బాదం పప్పులను నానబెట్టి పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్‌ చేసి మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిందా ఉదయాన్నే చల్లటినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వరుసగా పదిహేనురోజులు చేస్తే ఫలితం ఉంటుంది.

★ బంగాళాదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్ లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ మీద నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.

★ మూడు టీస్పూన్ల దోసరసం, రెండు టీస్పూన్ల అలొవెరా జెల్, టీస్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండ వల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.

★ టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్ లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతముగా మారుస్తుంది ఈ ప్యాక్.

★ గుప్పెడు వేపాకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, తగినన్ని రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దానిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే ముఖచర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

★ పుచ్చకాయ గుజ్జు ముఖానికి రాసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నిస్సేజంగా మారిన చర్మానికి పోషణ లభించి కాంతివంతమవుతుంది.


----------×-----------