ఎర్రని పెదాల కోసం చిట్కాలు.....

కొందరి పెదవులు నల్లగా కాంతివిహీనంగా కనిపిస్తే, మరికొందరివి తరచూ పగిలిపోవడం పెద్ద సమస్య. ఇలాంటివేం లేకుండా అందమైన పెదాలు సొంతం అవ్వాలంటే ఇలా చేసి చూడండి.

                                         .
★ కొన్ని ఎర్ర గులాబీ రేకల్ని పాలతో తడుపుకొంటూ ముద్దగా నూరుకోవాలి. దానికి చెంచా తేనె, కొంచెం మీగడ కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకోవాలి. ఉదయాన్నే చన్నీటితో కడిగి, బాదం నూనె రాసుకుంటే పెదాలు పొడిబారడం తగ్గుతుంది.

★ వెన్న, తేనె సమానంగా తీసుకొని, వాటికి రెండు చుక్కల నిమ్మరసం కలుపుకొని పెదవులపై మృదువుగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తే ఫలితం ఉంటుంది.

★ బీట్‌రూట్‌ గుజ్జులో కొంచెం కొత్తిమీర రసం, కొంచెం పాలమీగడ, చెంచా తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. పదినిమిషాల తరవాత చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో మూడునాలుగు సార్లు చేస్తే పెదాలు లేత గులాబీ రంగులోకి వస్తాయి.

★ నిమ్మరసంలో కొద్దిగా తేనె, గ్లిజరిన్‌ కలుపుకొని రోజూ రాత్రిపూట రాసుకొంటే క్రమంగా నలుపు తగ్గుతుంది. వెన్నకు కాస్త తేనె కలుపుకొని రాసుకొన్నా ఫలితం ఉంటుంది. 


★ పొడి బారిన పెదవులపై కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి.
★ కొంచెం పెరుగు తీసుకుని అందులో ఓ రెండు కుంకుమపువ్వు రెబ్బలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు రాసుకుంటే పెదవులకి మంచి రంగు వస్తుంది.
★ నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
★ టాల్కమ్ పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు నిలుస్తుంది.
★ వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.
★ గులాబీరేకుల రసాన్ని రోజూ రాత్రిపూట పెదవులకి రాసుకుంటే నలుపురంగు విరుగుతుంది.
★ ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీగడ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి.

★ బీట్‌రూట్ రసాన్ని రోజు విడిచి రోజు రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. 

                          ------------×-------------